Nov 4, 2019, 7:17 PM IST
అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం ప్రకటించారు. తహశిల్దార్ విజయారెడ్డిపై తహశిల్దార్ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇది దుర్మార్గమైన చర్యని, ఈ దహనకాండకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు కఠినంగా శిక్షించాలని అధికారులకు ఆదేశించారు. అధికారులపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విజయారెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాడ సానుభూతి తెలిపారు.