అధిక బరువే మీ సమస్య... అయితే తగ్గేందుకు ఈజీ చిట్కా ఉదయాన్నే ఈ డ్రింక్ తాగండి...

May 13, 2023, 5:22 PM IST

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే నల్ల మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు బ్లాక్ పెప్పర్ ను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు హెర్బల్ టీలను కూడా డైట్ లో చేర్చుకోవచ్చు. అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి నల్ల మిరియాలను డైట్ లో చేర్చుకోవచ్చు. నల్ల మిరియాలలో ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ పెప్పర్ ను డైట్ లో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.