Oct 10, 2019, 1:22 PM IST
గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జిలో దిగిన ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఓ జంట గోల్డ్ స్టార్ లాడ్జ్ లో దిగారు. తరువాత సాయంత్రం వరకు వారు బైటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జ్ నిర్వాహకులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి చూడగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు.
ప్రాథమిక విచారణలో మృతులు అమరావతి,జూపూడి కి చెందిన ఏకుల సాగర్ బాబు(24), కృష్ణ జిల్లా కంకిపాడు,గొల్ల గూడెంకు చెందిన గాలంకి తేజస్విని(23)గా గుర్తించారు. సాగర్ బాబు పురుగుల మందు తాగి, తేజస్విని చేయి కోసుకుని అధిక రక్తస్రావం వల్ల మృతి చెందారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.