Nov 27, 2019, 7:00 PM IST
గుంటూరు: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్ద ప్రత్తిపాడు నియోజికవర్గం ముట్లూరు గ్రామ టిడిపి నాయకులు తమ ఆవేదనను వెల్లగక్కారు. కుంటుంబాలతో సహా కలిసివచ్చిన తమను కాపాడాలంటూ ఆయన్ను వేడుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతుగా నిలిచినందుకు ఎస్సి సామాజిక వర్గానికి చెందిన తమపై(60 కుటుంబాలపై) వైసిపి నాయకులు దాడులకు పాల్పడుతున్నారని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలను అసభ్య పదజాలంతో వేధించడం...ఇళ్లపై దాడులు చేయడం...అక్రమ కేసులు పెడుతున్నారని... 180 మందిని గ్రామం నుండి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.