Oct 11, 2019, 6:26 PM IST
గుంటూరు అచ్చంపేట మండలం నిలేశ్వరపాలెంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు హనుమనాయక్ (26)మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సత్తెనపల్లిలోని నలంద కళాశాలలో TTC చదువుతున్న అప్సానా నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యింది. అదృశ్యం పై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు.