Video: కొడాలి నానిపై దూషణలు... అరెస్టయిన వ్యక్తిని పరామర్శించి మాజీ మంత్రి

Jan 24, 2020, 7:51 PM IST

అమరావతి: మంత్రి కొడాలి నానిని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగ్ లు పెట్టిన ఓ వ్యక్తిని  తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దొండపాడుకు చెందిన నన్నపనేని నాగమల్లేశ్వరావుని తుళ్లూరు గురువారం ఉదయం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాగమల్లేశ్వరావుని పరామర్శించారు.