Dec 19, 2020, 10:24 AM IST
గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని రామాటాకిస్ లైన్లో గల ఒక నిరు పేద కుటుంబం 7లక్షల అప్పులు తెచ్చి మరి ఒక చిన్న బట్టల షాపు అద్దెకి తీసుకొని అందులో చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తుంటారు ఇంతలోనే వారి గుండెకోత విషాద సంఘటన జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు బట్టల షాపు మొత్తం వ్యాపించి కొన్ని బట్టలు పూర్తిగా కాలిపోయాయి దీంతో లక్షల రూపాయలు సరుకు అగ్నికి ఆహుతి అయిపోయాయి చేసేదేమీలేక ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న ఆ అభాగ్యడు మాట్లాడుతూ 3 రూపాయలు వడ్డీకి లక్షల రూపాయలు తెచ్చి మరీ బట్టలు వ్యాపారం చేస్తున్నామని ఈ అగ్ని ప్రమాదంతో తమ కుటుంబం మొత్తం రోడ్డున పడిందని, అప్పులు ఎలా తిరుతాయో అని అయోమయం లో ఉన్నామని, ఎవరికి ఇబ్బందిగా లేకుండా కొద్దీపాటి చిరు వ్యాపారం చేస్తు బ్రతుకుతున్న తమకు ఇలాంటి పరిస్థితి ఏంటి అని బట్టల షొప్ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తూ వినిపిస్తున్నాడు