షాకింగ్.. ఉల్లిపాయ తింటే ప్రాణాలకు ప్రమాదమా?

Sep 1, 2020, 4:34 PM IST

ఉల్లి లేకుండా పూట గడవదు. ఏ కూరవండాలన్నా ముందుగా ఉండాల్సింది ఉల్లిగడ్డే. గోంగూర పచ్చడిలో ఉల్లి ముక్కలు లేకపోతే ఆ మజానే రాదు. ఇక నాన్ వెజ్ ప్రియులకు పక్కనే చక్రాలు కోసిన ఉల్లి లేకపోతే ఆ టేస్ట్ రాదు. బిర్యానీలో ఉల్లివాడకం ఇక చెప్పనక్కరలేదు. ఆరోగ్యం విషయంలోనూ ఉల్లి చేసిన మేలు తల్లి చేయలేదు అనే సామెత ఉంది. అయితే.. ఇప్పుడిది తలకిందులవుతోందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉల్లి తింటే ప్రాణాలు పోతాయంటూ యూఎస్, కెనడా హెల్త్ అథారిటీలు చెబుతున్నాయి.