Sep 20, 2019, 2:26 PM IST
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రానికి విడుదలకు ముందు చివరి క్షణంలో 'గద్దలకొండ గణేష్' గా టైటిల్ మారింది. ఏది ఏమైనా శుక్రవారం రోజు గద్దలకొండ గణేష్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ తేజ్ మాస్ అవతారంలో కనిపిస్తున్న గెటప్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. హరీష్ శంకర్ డైలాగులు బాగా పేలాయి. పూజా హెగ్డే కనిపించింది 20 నిమిషాలే అయినా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కామెడీ కూడా వర్కౌట్ అయిందని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.