వాల్మీకి ప్రీ టీజర్: మాస్ లుక్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్ (వీడియో)

Jun 25, 2019, 11:01 AM IST

మెగా వారసుడు వ‌రుణ్ తేజ్, ప్రముఖ దర్శకుడు హ‌రీష్ శంకర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్నక్రేజీ ప్రాజెక్ట్  “వాల్మీకి”. త‌మిళ  సూపర్ హిట్ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ రీసెంట్ గా  ప్ర‌ముఖ శివ క్షేత్రం యాగంటిలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 

14రీల్స్ బ్యానర్ పై ఆచంట రాము, గోపినాథ్ లు నిర్మిస్తున్న చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే చిత్ర హీరోయిన్ గా  న‌టిస్తుంది. చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పోస్ట‌ర్స్ విడుద‌ల కాక‌పోయే స‌రికి అభిమానులు చాలా ఆత్రుతగా సోషల్ మీడియాలో ఈ విషయం చర్చిస్తున్నారు.

ఈ క్ర‌మంలో వాల్మీకి ప్రీ రిలీజ్ టీజ‌ర్ ని ఈ రోజు ( జూన్ 24 సాయంత్రం ) విడుద‌ల చేసింది. వాల్మీకి చిత్రంతో తమిళ నటుడు అథర్వ మురళి తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న వాల్మీకి ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ ప్రీ టీజర్ ని చూడండి.