Apr 28, 2020, 11:09 AM IST
లాక్ డౌన్ వేళ పండించిన పంటను అమ్ముకోలేని రైతులకోసం సినీ నటులు ముందుకు వచ్చారు. రైతుల్ని కాపాడుకుందాం అంటూ సినీ నటీనటులు సాయి కుమార్ ,పృథ్వీ, రాజా రవీంద్ర ,ఉత్తేజ్ , జయలక్ష్మి, ఉత్తేజ్ కుమార్తె పాట తదితరులు ఈ విధంగా స్పందించారు. కరోన వ్యాధిని జయించాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.ఎన్నో పోషకవిలువలున్నమామిడి,పుచ్చకాయ,బొప్పాయి, బత్తాయి,జామ్, నిమ్మ, ద్రాక్ష, దానిమ్మ పండ్లు కొనుక్కొని తిందాం.మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.రైతన్నల్ని కాపాడుకుందాం..జై కిసాన్.. అంటూ వీడియో పెట్టారు.