Jun 24, 2022, 1:46 PM IST
టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ మంచి గుర్తింపు పొందిన ఈయన.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోగా ఎదుగుతున్నారు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మంచి సక్సెస్ ను అందుకున్న కిరణ్.. చివరిగా ‘సెబాస్టియన్ పీసీ 524’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేదు. తాజాగా కిరణ్, హీరోయిన్ చాందిని నటించిన చిత్రం ‘సమ్మతమే’ చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల మన్ననలను ఈ సినిమా పొందిందా లేదా ఈ పబ్లిక్ రివ్యూ లో చూడండి..!