RajaNarasimha : మమ్ముటీ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌...

Dec 24, 2019, 5:23 PM IST

లయాళ సూపర్‌స్టార్‌ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. 'మన్యం పులి' సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.