Nov 18, 2019, 12:57 PM IST
యాంకర్ సుమ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ యాక్సెప్ట్ చేశాడు. సుమక్క నువ్విచ్చిన ఛాలెంజ్ తీసుకున్నా మొక్కలు నాటుతున్నా అని చెబుతూ, ఈ ఛాలెంజ్ ను మొదలుపెట్టిన ఎంపీ సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపాడు. తాను మొక్కలు నాటడమే కాదు ఫలక్ నుమా దాస్ సినిమా హీరో విశ్వక్సేన్, పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్, వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ లకు ఈ ఛాలెంజ్ విసిరాడు.