Movie news : ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది

Nov 27, 2019, 4:18 PM IST

బాబ్జీ దర్శకత్వంలో మా అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రఘుపతి వెంకయ్యనాయుడు.  ఈ సినిమాను సతీష్ మండవ నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు ఆద్యుడైన రఘుపతి వెంకయ్యనాయుడు జీవితకథతో సినిమా చేయడం ఆనందంగా ఉందని నరేష్ అన్నారు. అమ్మ విజయనిర్మలకు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు వచ్చిన రోజు ఆయన జీవితంపై సినిమా తెరకెక్కించాలనే ఆలోచన మొదలైందని గుర్తుచేసుకున్నారు.