Jun 15, 2020, 4:54 PM IST
పెదరాయుడు సినిమాకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోహన్ బాబు అప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, నందమూరి తారక రామారావు, నిర్మాత రామానాయుడు, అక్కినేని నాగేశ్వర్రావుతో పాటు.. రజనీకాంత్ కూడా ఉన్నారు. ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి పెదరాయుడు సినిమా ముహుర్తం వేడుకకు వచ్చారు. మోహన్ బాబు వెన్నుతట్టిన ఎన్టీఆర్.. సినిమాకు క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు వచ్చిన దాసరి, ఎన్టీఆర్ కాళ్లపై పడి మోహన్ బాబు ఆశీర్వాదాలు తీసుకున్నారు. రజనీ కూడా మోహన్ బాబు కాళ్లపై పడి ఆయన్ని ఆట పట్టించారు. రజనీ.. మోహన్ బాబు మెడలో దండవేసిన సీన్ షూట్ కూడా ఈ వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.