Nov 15, 2022, 4:00 PM IST
హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ మృతికి ఇప్పటికే సోషల్ మీడియా వేదికన సంతాపం ప్రకటించిన ఐటీ మంత్రి కేటీఆర్ తాజాగా ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేటీఆర్ మృతదేహంపై పూలుజల్లి నివాళి అర్పించారు. అనంతరం తండ్రిని కోల్పోయిన బాధలో వున్న హీరో మహేష్ బాబును ఓదార్చారు. ఈ సమయంలో అక్కడేవన్న మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసారు కేటీఆర్. మహేష్ బాబు పక్కనే కూర్చుని ధైర్యంచెప్పిన కేసీఆర్ ఘట్టమనేని కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా కేటీఆర్ వెంటవెళ్లి కృష్ణ మృతదేహంవద్ద నివాళి అర్పించారు.