కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కింద మంగళవారం ఒక్కరోజే వెయ్యి మంది సినీకార్మికులకు నిత్యావసరాలు అందించారు. సీసీసీ సరుకుల పంపిణీ చేస్తున్న టీమ్ ని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ఒకే రోజు వెయ్యి మందికి సరుకులు పంపిణీ చేయడం మామూలు విషయం కాదు. డబ్బు ఉన్నా సేవ చేసే వాళ్లు కావాలి. తమ బాధ్యత అని భుజాలమీద వేసుకున్నవీరిని చూసి అందరూ అభినందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఈ పంపిణీ విధానం తెలుసుకొని నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్ తోపాటు మరీ ముఖ్యంగా మెహర్ రమేష్ కి నా ప్రత్యేక అభినందనలు`` అని వాయిస్ మెసేజ్ ఇచ్చారు.