Jun 23, 2022, 11:03 PM IST
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ హితం కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కరణ్ అర్జున్ మూవీ టీం పాల్గొంది. ఈ సినిమా ధర్శకుడు మోహన్ శ్రీవత్స, హీరో అభిమన్యు, హీరోయిన్ శైఫాతో తదితరులు బంజారాహిల్స్ లో మొక్కను నాటారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్, నటి శైఫా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. తమకు మొక్కలు నాటే గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కు కరణ్ అర్జున్ టీం ధన్యవాదాలు తెలిపారు.