ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది.. హీరో శ్రీకాంత్

Apr 11, 2020, 10:27 AM IST

లాక్ డౌన్ వల్ల పనులు లేక పూట గడవక ఇబ్బంది పడుతున్న వారికోసం చాలామంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో శ్రీకాంత్ తన స్నేహితులతో కలిసి చిత్రపురి కాలనీలో 300మందికి అన్నదానం చేశారు. ఇక్కడ బీహార్, శ్రీకాకుళం నుండి వచ్చినవారు అధికంగా ఉంటారని.. కరోనావైరస్ వల్ల వారికి పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాంత్ అన్నారు.