F3 Movie: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎఫ్3 సినిమా బృందం

May 26, 2022, 9:48 AM IST

విజయవాడ: థియేటర్లను లాఫింగ్ క్లబ్ లుగా మార్చేందుకు F3 సినిమా సిద్దమయ్యింది. సినిమా విడుదల సందర్భంగా మూవీ యూనిట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను విజయవాడలో జరిగిన మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకుని కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు నిర్మాత, డైరెక్టర్. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని దిల్ రాజు, అనిల్ రావిపూడికి అందించారు.