Jul 3, 2020, 5:35 PM IST
బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి పట్ల యావత్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆమె తన తొలి గురువు అంటూ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ఆమెకు నివాళులు అర్పించారు. మొహ్రా సినిమాలో తూ ఛీజ్ బడీ హై మస్త్ మస్త్.. పాటతో ఆమెతో తనకు అనుబంధం మొదలయిందని చెబుతున్నారు. ఆమె మృతి తీరని లోటని కన్నీటి పర్యంతం అయ్యారు.