Nov 30, 2019, 11:25 AM IST
కొన్ని రోజుల క్రితం చిరంజీవి నివాసంలో 80 దశకంలోని హీరో, హీరోయిన్ల రీయూనియన్ పార్టీ జరిగింది. దక్షణాది చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది హీరో, హీరోయిన్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. సెలెబ్రిటీలంతా బ్లాక్ అండ్ సిల్వర్ డ్రెస్సుల్లో మెరిసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇదిలాఉండగా తాజాగా సెలెబ్రిటీలంతా పార్టీలో రచ్చ చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. చిరంజీవి, ఖుష్బూ కలసి బంగారు కోడిపెట్ట సాంగ్ కు రెచ్చిపోయి డాన్స్ చేశారు. చిరంజీవితో పాటు జయప్రద కూడా డాన్స్ చేసింది.