విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో 'బ్రో' హీరో సాయిధరమ్ తేజ్, సముద్రకని

Aug 1, 2023, 11:16 AM IST

విజయవాడ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'బ్రో' ఇటీవలే విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ విజయోత్సవంలో భాగంగా చిత్ర బ‌ృందం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది. హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. వారికి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. కనకదుర్గమ్మ దర్శనం అనంతరం వేద పండితులు హీరో, దర్శకుడికి ఆశీర్వచనం అందించారు