Aug 28, 2021, 5:08 PM IST
బిగ్ బాస్ త్వరలో మాటీవీలో ప్రసారం అవనున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా కింగ్ నాగ్ హోస్ట్ గా వ్యవహరించనున్న విషయాన్నీ ఇప్పటికే ఒక ప్రోమో ద్వారా వదిలారు కూడా. ఈ సారి ఎవరు మీలో కోటీశ్వరులు, ఐపీఎల్ వంటి వాటిని కూడా తట్టుకుని నిలబడేలా... బాగా పాపులర్ సెలెబ్రిటీలను ఇప్పటికే షో కోసం క్వారంటైన్ లో ఉంచింది బిగ్ బాస్ టీం. యాంకర్ రవి, నటుడు పడాల జస్వంత్,యూట్యూబ్ నటి సిరి హన్మంత్,యూట్యూబర్ షణ్ముఖ్, నటి శ్వేతా వర్మ,నటి లహరి శ్రీ ,కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్,నటుడు విజే సన్నీ, జబర్దస్త్ ప్రియాంక,యూట్యూబర్ ఆర్జే కాజల్,నటుడు లోబో, నటి ప్రియా.నటుడు మానస్, నటి ఉమాదేవి, నటుడు దీపక్ సరోజ్,యాంకర్ వర్షిణి,నటి పూనమ్ బజ్వా, ఆట సందీప్, నటుడు విశ్వ,యూట్యూబ్ సరయు, నటరాజ్ మాస్టర్.. క్వారంటైన్ లో ఉన్నారు. సెప్టెంబర్ 5న బిగ్ బాస్ మెగా ఈవెంట్ కి తెర లేవనుంది.