Apr 27, 2022, 12:58 PM IST
విజయవాడ: విడుదలకు సిద్దంగా వున్న ఆచార్య సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు కొరటాల శివ, హీరో రామ్ చరణ్ ఇవాళ(బుధవారం) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి బయలుదేరిన వీరు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరి రాకగురించి తెలిసి ముందుగానే ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకున్న మెగా అభిమానులు ఘనస్వాగతం పలికారు.