AR Rahman Birthday : రహమాన్ తుస్సీ గ్రేట్ హో...

Jan 7, 2020, 11:38 AM IST

ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన సంగీత దిగ్గజం ఎఆర్ రెహమాన్. భారత్ గర్వించదగ్గ సంగీతకారుడు.  మనందరికీ స్ఫూర్తివంతుడైన సంగీతదిగ్గజం. ఈ రోజు ఎర్ రెహమాన్ 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆ సంగీతమాంత్రికుడి గురించి మనకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. రెహమాన్, రెహమాన్ కొడుకు అమీన్ ఇద్దరి పుట్టినరోజు ఒకటే కావడం విశేషం. ఇద్దరు పుట్టింది జనవరి 6వ తేదీనే.ఆస్కార్ అవార్డు వచ్చిన జై..హో.. పాట మొదట సల్మాన్ ఖాన్ నటించిన యువరాజ్ సినిమాకోసం కంపోజ్ చేశాడు.