Jan 28, 2021, 4:35 PM IST
మొన్నటి వరకు `రష్మీ రాకెట్` చిత్రం కోసం తీవ్రంగా శ్రమించింది తాప్సీ. ఎక్కువ సమయంలో జిమ్‌లోనే గడిపింది. ఎంత కఠినంగా తన బాడీని మౌల్డ్ చేసుకుందో వీడియోలు, ఫోటోల రూపంలో చూపించింది. ఇక ఆ సెషన్ పూర్తయ్యింది. ఇప్పుడు మరో సెషన్ స్టార్ట్ చేసింది. క్రికెటర్‌గా మారిపోయింది. బ్యాట్ పట్టి బాల్‌ని బౌండరీలు దాటించే పనిలో బిజీ అయ్యింది. ఇండియా లేడీ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గానూ మారబోతుంది. ఇదంతా తాను నటిస్తున్న `శెభాష్ మిథు` చిత్రం కోసం.