Nov 19, 2019, 7:54 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ మూడు మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ కూడా అపాల్గొన్నారు. మనం సైతం కాదంబరి కిరణ్ హీరోలు పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ , హీరో వెంకటేష్ లకు కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సూపర్ స్టార్ కృష్ణ అభినందించారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని ,వాటిని సంరక్షణ చెయ్యాలని పిలుపునిచ్చారు సూపర్ స్టార్ కృష్ణ.