Apr 14, 2023, 5:04 PM IST
దర్శకుడు గుణశేఖర్.. తెలుగులో భారీ విజువల్ గ్రాండియన్ చిత్రాలకు కేరాఫ్. కానీ ఆ విషయంలోనే ఆయన మెప్పించడం లేదు. `రుద్రమదేవి` లాంటి భారీ చిత్రాన్ని తీసి కొంత విమర్శల పాలయ్యారు. ఈసారి వాటిని దాటుకుని `శాకుంతలం` చిత్రంతో మెప్పించేందుకు వచ్చారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యాన్ని ఆధారంగా చేసుకుని `శాకుంతలం` చిత్రాన్ని రూపొందించారాయన. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సమంత.. శకుంతలగా నటించింది. దేవ్ మోహన్.. దుష్యంతుడి పాత్రలో నటించారు. గుణా టీమ్‌వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై నీలిమా గుణ, దిల్‌రాజు నిర్మించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో చూసిన ప్రేక్షకుల మాటల్లోనే...