అమరావతిలోనే జగన్ ప్రమాణస్వీకారం... రాంగోపాల్ వర్మ 'వ్యూహం' ఇదే..!

Aug 9, 2023, 3:24 PM IST

అమరావతి : వివాదాస్పద టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే కథాంశంగా 'వ్యూహం' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు పాత్రలను కూడా వర్మ చూపించనున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యూహం మూవీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.