Jun 22, 2021, 6:13 PM IST
'కెరటం’తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ తో చేసిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తొలి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోలకు లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగింది. అయితే మన్మధుడు 2 తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్స్ బాగా తగ్గాయి. వరస ఫ్లాఫ్ లే అందుకు కారణం అని కొందరు అంటటున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రకుల్ అదేం లేదంటోంది.