థియేటర్లలో తమ్ముడు సినిమా రీరిలీజ్ ... పవన్ ఫ్యాన్స్ కోలాహలం

Aug 31, 2022, 1:23 PM IST


పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను ఫ్యాన్స్ అత్యంత ఘనంగా పనిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు థియేటర్లలో తమ్ముడు సినిమా రీరిలీజ్ జరిగింది. దీనికి ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి వచ్చి సినిమాని చూస్తున్నారు. థియేటర్ల బయట ఆటపాటలతో వాతావరణం కోలాహలంగా మారింది. రేపు జల్సా సినిమా కూడా ఉండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు..! థియేటర్ల వద్ద ఫ్యాన్స్ కోలాహలం చూడండి..!