Jun 9, 2021, 7:21 PM IST
మహేష్‌బాబు మొదటి సారి ఓ పౌరాణిక సినిమా చేయబోతున్నాడా? ఆయన `ప్రతాపరుద్రుడి`గా కనిపించబోతున్నాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. తనకు `ఒక్కడు`, `అర్జున్`, `సైనికుడు` లాంటి విజయవంతమైన సినిమాలను అందించిన గుణ శేఖర్ దర్శకత్వంలో మహేష్ `ప్రతాపరుద్రుడు` పేరుతో రూపొందే చిత్రంలో నటించబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం గుణశేఖర్.. సమంతతో `శాకుంతలం` సినిమాని రూపొందిస్తున్నారు.