May 4, 2021, 5:21 PM IST
పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. ఆచి,తూచి రిలీజ్ డేట్ లు ఫిక్స్ చేసుకుంటూంటారు. సీజన్, అన్ సీజన్ చూసుకోవాలి. ప్రక్కన ఏ సినిమాలు రిలీజ్ పెట్టుకున్నాయో గమనించుకోవాలి. తమ సినిమాకు ఏ సినిమా పోటీ కాకుండా ప్లాన్ చేసుకోవాలి. ఇన్ని చేసాక...ఫిక్స్ చేసుకున్న డేట్ కు రిలీజ్ చేయగలగాలి. అయితే ఒక్కోసారి అది చాలా టఫ్ టాస్క్ గా మారిపోతుంది. ‘కేజీఎఫ్ 2’ది ఇప్పుడు అదే పరిస్దితి. కరోనా దెబ్బతో ప్లాన్ చేసుకున్న రిలీజ్ డేట్ కు రిలీజ్ అవటం కష్టమే అని తేలిపోయింది. ఫస్ట్ కాపీతో సినిమా రిలీజ్ కు రెడీ ఉన్నా..ఏం చేయాలో తెలియని సిట్యువేషన్ లో కు వెళ్లింది.