కార్తికేయ 2 సక్సెస్ ఎఫెక్ట్... నిఖిల్ కి రెండు బడా బాలీవుడ్ ఆఫర్స్

Sep 4, 2022, 2:34 PM IST

పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో నిఖిల్ ఒకరు. శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ హ్యాపీ డేస్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన వాళ్లలో అందరూ కనుమరుగయ్యారు. నిఖిల్, తమన్నా మాత్రమే రాణించారు. నిఖిల్ ప్రయాణం మాత్రం చాలా కఠినంగా సాగింది. హిట్స్, ప్లాప్స్, అవమానాలు, బెదిరింపులు ఎన్నో ఎదుర్కొన్నాడు. నిఖిల్ అర్జున్ సురవరం చిత్రం అసలు సంబంధం లేని వాళ్ళ చేతుల్లో చిక్కుకొని విడుదల ఆలస్యం అయ్యింది.  సినిమా విడుదల అవుతుందా...  అనుకుంటుండగా అన్ని ప్రాబ్లెమ్స్ పరిష్కరించి మూవీ విడుదల చేశారు.