Jan 31, 2021, 5:23 PM IST
ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్`లో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది. దీంతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. `అరవింద సమేత` తర్వాత వీరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని ఇటీవల నిర్మాతలు హింట్ ఇచ్చారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, కళ్యాణ్‌రామ్ ఈ సినిమాని నిర్మించనున్న విషయం తెలిసిందే.