కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన హీరో సూర్య

Feb 8, 2021, 2:08 PM IST

‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను.ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాను. మన  జీవితాలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు . భయం వద్దు. అదే సమయంలో భద్రత మరియు శ్రద్ధ అవసరం. కరోనా నుంచి కోలుకోవడానికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు ’’ అని తెలియజేస్తూ హీరో సూర్య ట్వీట్ చేశారు. తనను కలిసిన మిత్రులు అందరూ చెకప్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.