May 7, 2021, 6:29 PM IST
సుకుమార్ ఆలోచనలు పదేళ్ల ముందుంటాయని, ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటారని, కాస్త దిగొచ్చి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవుతాయని ఓ ప్రెస్‌మీట్‌లో దర్శకధీరుడు రాజమౌళినే స్వయంగా చెప్పాడు. అలా సుకుమార్ దిగొచ్చి చేసిన సినిమానే `రంగస్థలం`. ఆయన చెప్పినట్టుగానే ఇది సంచలన విజయం సాధించింది. రామ్‌చరణ్ హీరో, సమంత కథానాయికగా, 1980 నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ సినిమా కథలకు కొత్త దారులు చూపించిన చిత్రమిది. కమర్షియల్ చిత్రాల ట్రెండ్‌కి బ్రేకులు వేసి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో చిట్టిబాబుగా రామ్‌చరణ్ చెవిటి వాడిగా రామ్‌చరణ్ అద్భుతమైన నటనని పలికించాడు.