Oct 13, 2021, 6:44 PM IST
శ్రీరామ్‌తో ఉన్న బాండింగ్ ఫ్రెండ్‌షిప్ అని చెప్పలేను, ప్రేమ అని కూడా డిఫైన్ చేయలేనని, అలాగని ప్రేమ కాదని కూడా అనలేనని, తమది ఒక డిఫరెంట్ బాండింగ్ అని చెప్పింది బిగ్‌బాస్5 ఫేమ్ హమీద. శ్రీరామ్ తన గుండెలో ఉంటాడని, బిగ్‌బాస్ తర్వాత కూడా తమ బాండింగ్ కంటిన్యూ అవుతుందని పేర్కొంది హమీద. హౌజ్‌లో శ్రీరామ్‌తో రిలేషన్‌కి సంబంధించి తమ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఐదో వారం బిగ్‌బాస్5 హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన హమీద బుధవారం `థ్యాంక్స్ మీట్`లో అనేక ఆసక్తికర విషయాలను బోల్డ్ గా పంచుకుంది.