Feb 3, 2021, 4:54 PM IST
భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరి 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ బిడ్డకు ‘వామిక’ అని నామకరణం చేసింది విరుష్క జోడి. అనుష్క శర్మ పోస్టు చేసిన ఈ ఫోటోపై అమెరికన్ పాప్ సింగర్, రైటర్ జూలియా మైఖేల్స్ ‘కంగ్రాట్స్ అంటూ కామెంట్ చేసింది... అయితే జూలియా ఫోటోలను చూసిన నెటిజన్లకు షాక్ తగిలింది. జూలియా మైఖేల్స్ అచ్చు అనుష్క శర్మలాగే కనిపించింది. అయితే జూలియా జట్టు తెలుపు రంగు అయితే అనుష్క శర్మ హెయిర్ బ్లాక్... అంతే తేడా...