Feb 21, 2021, 12:50 PM IST
రాజమండ్రి: సందేశాత్మక కథలతో కమర్షియల్ చిత్రాలకు దీటుగా విజయవంతమైన చిత్రాలను రూపొందించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఇందుకోసం హైదరాబాద్ నుండి విమానంలో మధురపుడి విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి ఘన స్వాగతం లభించింది. ఆయనకు పూలమాలలతో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన అభిమానులకు అభివాదం చేస్తూ ఏజెన్సీలో ఆచార్య షూటింగ్ కు ర్యాలీగా బయలుదేరారు చిరంజీవి.