Nov 2, 2019, 4:07 PM IST
కర్నూలు, ప్యాపిలి మండలం పోతు దొడ్డి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న బెంగళూరుకు చెందిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరు, ఓ ప్రయాణికుడు మృతి చెందారు. గాయపడ్డ వారిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.