video news : కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాయలసీమ విద్యార్థి జేసేసీ భారీ ర్యాలీ

Nov 2, 2019, 12:53 PM IST

బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని రాయలసీమ జేఏసీ సంఘాలు హెచ్చరించాయి.