Nov 6, 2019, 7:49 PM IST
చిత్తూరు జిల్లా, రామకుప్పం ఎమ్మార్వో కార్యాలయంలో ఐదు రైతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై ఇతరులకు పాస్ బుక్ లు ఇవ్వడంతో చేసేది లేక ఎమ్మార్వో కార్యాలయంలోనే ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కార్యాలయం గేట్లకు ఉరి వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లాలో కలకలం రేగింది.