ఖమ్మంలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం (వీడియో)

Oct 13, 2019, 12:52 PM IST

ఖమ్మం కలెక్టరేట్ సాక్షిగా పోలీసులు అంతా చూస్తుండగానే మరో ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు, రాజకీయ నేతలు, పోలీసులు అతనిని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా కార్మిక నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా ఖమ్మంలో శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఈ నెల 14న ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.