పుజారాకు అశ్విన్ సవాల్: ఆ పని చేస్తే సగం మీసం తీయించుకుంటానని సంచలన ప్రకటన

Jan 26, 2021, 11:27 AM IST

భారత టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారాకు రవిచంద్రన్‌ అశ్విన్‌ సవాల్‌ విసిరాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో సమారు వెయ్యి బంతులు ఎదుర్కొన్న పుజారా.. పరుగుల పరంగా తక్కువే చేసినా సిరీస్‌పై అతడి ప్రభావం అమోఘం. ఓ ఎండ్‌లో అతడు ఉన్నాడనే అండతోనే సిడ్నీలో, బ్రిస్బేన్‌లో యువ ఆటగాళ్లు రిషబ్‌ పంత్‌, శుభ్‌మన్‌గిల్‌లు చెలరేగారు.ఒక పక్క పుజారా వంటి సీనియర్లు బలంగా గ్రౌండ్ ని హోల్డ్ చేస్తూ తోడ్పాటును అందిస్తేనే అవతలి ఇందులో వేరే వాళ్ళు స్వేచ్ఛగా తమ సహజ ఆటతీరును ఆడే వీలుంటుంది.