Jan 10, 2021, 12:43 PM IST
ప్రస్తుత బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో చివరి టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్ విధింపు, నాల్గో టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టు కఠిన క్వారంటైన్ ఎదుర్కొవాల్సి రావటం వంటి అంశాలు ఇప్పటికే బ్రిస్బేన్ టెస్టును ప్రమాదంలో పడేశాయి. వీటికి తోడుగా స్పెషల్ ఎఫెక్ట్ అన్నట్టు తాజాగా బ్రిస్బేన్‌లో కరోనా వైరస్ మహమ్మారి నూతన రకం యుకె స్ట్రెయిన్ వెలుగు చూడటంతో.. అక్కడికి ప్రయాణించేందుకు భారత జట్టు గట్టిగా నిరాకరిస్తోంది. ఈ మేరకు ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కి బీసీసీఐ తెలియజేసినట్టు సమాచారం.