Dec 2, 2020, 4:13 PM IST
ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన టి నటరాజన్... తన యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఐపీఎల్ తర్వాతి క్రికెట్ సీజన్‌లో టీమిండియా తరుపున ఆడతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఆసీస్ టూర్‌కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తప్పుకోవడంలో అతని ప్లేస్‌లో లక్కీగా జట్టులోకి వచ్చిన నటరాజన్, మూడో వన్డేలో టీమిండియా తరుపున ఆడుతూ రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. సైనీ భారీగా పరుగులు ఇవ్వడంతో నటరాజన్‌కి తుది జట్టులో అవకాశం దక్కింది.ఈ నేపథ్యంలో భారత టీంలోని లెఫ్ట్ ఆర్మ్ పసర్లను ఒకసారి పరిశీలిద్దాము.