Dec 21, 2020, 1:33 PM IST
బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా విదేశంలో అడిలైడ్ లో భారత్ ఆడుతున్న తొలి డే నైట్ టెస్టులో టీమ్ ఇండియా అనూహ్య పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే! తొలి రెండు రోజుల పాటు విజయానికి బాటలు వేసుకున్న టీమిండియా... మూడో రోజు ఆటలో గంట వైఫల్యం చెందటం టెస్టు మ్యాచ్ ను కోల్పోయేలా చేయటంతో పాటుగా ఐదు రోజుల ఆట చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు పరిమితమయ్యేలా చేసింది.